శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 21, 2020 , 02:43:35

వెయిటింగ్‌ లిస్ట్‌ రద్దు చేయట్లేదు

వెయిటింగ్‌ లిస్ట్‌ రద్దు చేయట్లేదు

న్యూఢిల్లీ: రైళ్లలో 2024 నుంచి ‘వెయిటింగ్‌ లిస్ట్‌' నిలిపివేస్తున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై రైల్వే శాఖ స్పందించింది. వెయిటింగ్‌ లిస్ట్‌ విధానం కొనసాగుతుందని స్పష్టంచేసింది. రైల్వే బోర్డు శుక్రవారం నేషనల్‌ రైల్‌ ప్లాన్‌ ముసాయిదాను విడుదల చేసింది. ప్రయాణికులందరి టికెట్లు కన్ఫర్మ్‌ అయినవే ఉంటాయని, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదని అందులో పేర్కొంది. ఇది గందరగోళానికి దారితీయడంతో తాజాగా స్పష్టతనిచ్చింది. 


logo