గురువారం 28 జనవరి 2021
National - Dec 28, 2020 , 01:38:41

నిరసనల ‘మోత’

నిరసనల ‘మోత’

మన్‌ కీ బాత్‌కు కౌంటర్‌గా పళ్లాలు మోగించిన రైతులు

న్యూఢిల్లీ/చండీగఢ్‌, డిసెంబర్‌ 27: ప్రధాని ‘మన్‌ కీ బాత్‌' కార్యక్రమం సందర్భంగా రైతులు వినూత్న నిరసన తెలిపారు. ఆదివారం ఈ కార్యక్రమం రేడియోలో కొనసాగుతున్నంత సేపు పళ్లాలు మోగించారు. ‘మోదీ మన్‌ కీ బాత్‌ వినీవినీ అలసిపోయాం. ప్రధాని రైతుల మన్‌ కీ బాత్‌ విననప్పుడు ఆయన మన్‌ కీ బాత్‌ను మేము ఎందుకు వినాలి?. అందుకే ఈ పళ్లాల చప్పుడు. ఈ శబ్దానికి మోదీ ఎంత చెప్పినా మాకు వినపడదు’ అని స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ తెలిపారు. కరోనాను అడ్డుకోవడానికి ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, ఇతరులను గౌరవించడానికి గిన్నెల చప్పుడు చేయాలని గతంలో మోదీ పిలుపునిచ్చారని, తమ మన్‌ కీ బాత్‌ వినని ప్రధానికి పళ్లాల చప్పుడుతో నిరసన తెలుపుతున్నామని రైతు నేత రాకేశ్‌ తికాయత్‌  తెలిపారు. తాజాగా పంజాబ్‌లో అంబానీ, అదానీలకు చెందిన మరో 150 టెలికం టవర్లను ధ్వంసం చేశారు. వీటితో కలుపుకొని ఇప్పటి వరకు ధ్వంసమైన టవర్ల సంఖ్య దాదాపు 1,338కి చేరింది.

తల్లికి పుట్టినోడు ఎవరైనా సరే రైతుల భూమిని లాక్కోలేడు. కొంతమంది అమాయక రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 

    - రాజ్‌నాథ్‌ సింగ్‌ 


logo