బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 15:56:28

అమిత్‌ షా రాజీనామా చేయాలి : సోనియా

అమిత్‌ షా రాజీనామా చేయాలి : సోనియా

న్యూఢిల్లీ : సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు, ఘర్షణలను కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఖండించారు. ఈ ఘటనలపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమై చర్చించింది. సమావేశం ముగిసిన అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో అల్లర్ల ఘటనలు బాధాకరమని ఆమె అన్నారు. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లకు కేంద్రమే బాధ్యత వహించాలి. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సోనియా డిమాండ్‌ చేశారు. మూడు రోజుల ఆందోళనలో 20 మంది చనిపోవడం బాధాకరమన్నారు. కొంతమందైతే బుల్లెట్‌ గాయాలతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా కూడా పోలీసు బలగాలను మోహరించడంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం అలసత్వం వహించిందని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. 


logo
>>>>>>