మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 01, 2020 , 14:38:06

ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల కేంద్ర క్యాబినెట్ సంతాపం

ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల కేంద్ర క్యాబినెట్ సంతాపం

హైద‌రాబాద్‌: భార‌త ర‌త్న‌, మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల ఇవాళ కేంద్ర క్యాబినెట్ సంతాపం ప్ర‌క‌టించింది. ప్ర‌ణ‌బ్‌ను గుర్తు చేస్తూ కేంద్ర క్యాబినెట్ రెండు నిమిషాల మౌనం పాటించింది. ఈ నేప‌థ్యంలో క్యాబినెట్ తీర్మానం చేసింది. కేంద్ర క్యాబినెట్ ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ఆ తీర్మానంలో పేర్కొన్నారు.  ఓ విశిష్ట‌మైన నేత‌ను, అసాధార‌ణ పార్ల‌మెంటేరియ‌న్‌ను కోల్పోయిన‌ట్లు క్యాబినెట్ వెల్ల‌డించింది. ప‌రిపాల‌నా విభాగంలో ప్ర‌ణ‌బ్‌కు ఎన‌లేని అనుభ‌వం ఉన్న‌ట్లు క్యాబినెట్ కీర్తించింది. విదేశాంగ‌, ర‌క్ష‌ణ‌, వాణిజ్య‌, ఆర్థిక మంత్రిగా ప్ర‌ణ‌బ్ కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ట్లు క్యాబినెట్ పేర్కొన్న‌ది. మ‌న దేశ ప్ర‌జ‌ల్లో ప్ర‌ణ‌బ్ త‌న ముద్ర‌ను సుస్థిరం చేసుకున్నార‌‌ని, ప్ర‌ణ‌బ్ మృతితో దేశం ఓ ప్ర‌ముఖ జాతీయ నేత‌ను కోల్పోయింద‌ని తెలిపారు.  ప్ర‌ణ‌బ్ ఓ గొప్ప పార్ల‌మెంటేరియ‌న్ అని, రాజ‌నీతిలో దిట్ట అని తీర్మానించారు. దేశానికి ప్ర‌ణ‌బ్ అందించిన సేవ‌ల ప‌ట్ల ప్ర‌గాఢ‌మైన ప్ర‌శంస‌లు చెబుతున్న‌ట్లు క్యాబినెట్ పేర్కొన్న‌ది. కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున‌, యావ‌త్ దేశం త‌ర‌పున ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు హృద‌య‌పూర్వ‌క సంతాపం తెలుపుతున్నామ‌ని క్యాబినెట్ పేర్కొన్న‌ది. ఢిల్లీలోని లోధి శ్మ‌శాన‌వాటిక‌లో ఇవాళ మ‌ధ్యాహ్నం ప్ర‌ణ‌బ్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. సైనిక లాంఛ‌నాల‌తో.. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ప్ర‌ణ‌బ్‌కు ఫేర్‌వెల్ ప‌లికారు.  

 


 


logo