శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 16:28:55

రైలు ప్రయాణాలు రద్దు అయిన వారికి ఊరట

రైలు ప్రయాణాలు రద్దు అయిన వారికి ఊరట

న్యూడిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో లౌక్‌డౌన్‌ కారణంగా మార్చి 25 నుంచి రైలు సర్వీసులను నిలిపివేసింది కేంద్రం. ఏప్రిల్‌ 15 నుంచి రైల్వే బుకింగ్‌లను కూడా నిలిపివేసింది. ఆయా రైళ్లకు చెందిన రిజర్వేషన్లు కూడా రద్దు చేసింది. అయితే అప్పటి వరకు రైల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్‌ చేసుకుని ప్రయాణాలు రద్దు అయిన వారికి ఊరట కలిగేలా కేంద్ర రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్‌ 14 లేదా ఆ తర్వాత రైల్వే టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణాలు రద్దు అయిన వారికి ఆయా టికెట్ల మొత్తాన్ని తిరిగి ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ప్రస్తుతం అత్యవసర ప్రయాణాల నిమిత్తం వివిధ మార్గాల్లో 230 రైళ్లు నడుస్తున్నాయి. logo