శనివారం 16 జనవరి 2021
National - Jan 06, 2021 , 12:20:58

కేర‌ళ నుంచి మైసూర్‌కు కోళ్ల ర‌వాణాపై నిషేధం

కేర‌ళ నుంచి మైసూర్‌కు కోళ్ల ర‌వాణాపై నిషేధం

బెంగ‌ళూరు: కేర‌ళలో బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ నిర్ధార‌ణ కావ‌డంతో అక్క‌డి నుంచి కోళ్లు, ఇత‌ర ప‌క్షుల ర‌వాణాపై క‌ర్ణాట‌క‌కు చెందిన మైసూర్ జిల్లా అధికార యంత్రాంగం నిషేధం విధించింది. ఈ మేర‌కు మైసూర్ జిల్లా హెచ్‌డీ కోట్ తాలూకాలోని బోధి చెక్‌పోస్ట్ వ‌ద్ద గ‌ట్టి నిఘా ఏర్పాటు చేసింది. కేర‌ళ నుంచి కోళ్లు, ఇత‌ర ప‌క్షులు మైసూర్‌లోని ర‌వాణా కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది. కేర‌ళ‌లో బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మైసూర్ జిల్లా క‌లెక్ట‌ర్ తెలిపారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.