సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 14:00:45

ట్రాక్టర్‌తో పాలు పితుకుతున్నడు!... వైరల్‌ వీడియో

ట్రాక్టర్‌తో పాలు పితుకుతున్నడు!... వైరల్‌ వీడియో

హైదరాబాద్‌ : ప్రతిభకు చదువొక్కటే కొలమానం కాదు. కొందరు లేకపోయినా కొత్తగా వస్తువులను తయారు చేస్తుంటారు. అలాంటి వారికి దేశంలో కొదవలేదు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఎందరో నిరూపించారు. సరిగ్గా ఈ కేవలోకే వస్తాడు ఓ యువ రైతు. ట్రాక్టర్ సహాయంతో పాలు పితికే పరికరాన్ని రూపొందించాడు. మాములుగా పాలు పితికే సాధనం మార్కెట్‌లో అధిక ధరలు ఉండడంతో సొంతంగా పాలు పితికే పరికరాన్ని తయారు చేయాలని సంకల్పించాడు. అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి దీన్ని తయారు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా, నెట్టింట వైరస్‌ అవుతోంది. ఈ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఇండియాలోని గ్రామాల్లో మా (మహీంద్ర) ట్రాక్టర్‌ను మల్టీ టాస్కింగ్ కోసం వినియోగిస్తున్నారని, ఎలా ఉపయోగిస్తున్నారో ప్రజలు నాకు క్లిప్పులు పంపిస్తున్నారు. ఇది నాకు కొత్త. మీలో ఉన్న నాన్ ఇంజినీర్స్ ఇలా చేయగలరా? అని ట్వీట్ చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
logo