సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 18:45:26

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 223

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 223

ఢిల్లీ : దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్యను కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో మొత్తం 223 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 32 మంది విదేశీయులు ఉన్నారు. కోవిడ్‌-19 కారణంగా నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్రలో ఒక్కో వ్యక్తి మృతిచెందాడు. భారత ఆర్మీ 900-1000 పడకలతో క్వారంటైన్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ నోడల్‌ అధికారి బ్రిగేడియర్‌ అనుపమ్‌ శర్మ తెలిపారు. జైసల్మేర్‌, వైజగ్‌, జోద్‌పూర్‌, గోరక్‌పూర్‌లో క్వారంటైన్‌ సౌకర్యాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అవసరమైతే వీటి సంఖ్యను తక్షణమే పెంచేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 

కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం అన్ని రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రధాని వివరించారు. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ను అడ్డుకోవాలన్నారు. 


logo