గురువారం 04 మార్చి 2021
National - Jan 20, 2021 , 15:07:08

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ప‌దో విడత చ‌ర్చ‌లు ప్రారంభం

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ప‌దో విడత చ‌ర్చ‌లు ప్రారంభం

న్యూఢిల్లీ: ‌కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై రైతుల సంఘాల నాయ‌కులు, ప్ర‌భుత్వం మ‌ధ్య 10వ విడత చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వన్‌లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ చ‌ర్చ‌ల‌కు రైతుల త‌ర‌ఫున వివిధ సంఘాల నేత‌లు హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున కేంద్ర‌ వ్య‌వ‌సాయశాఖ మంత్రి ‌న‌రేంద్ర‌సింగ్ తోమర్‌, కేంద్ర ఆహార పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. కాగా ప్ర‌భుత్వం, రైతుల సంఘాల ప్ర‌క‌ట‌న‌ల‌ను బ‌ట్టి చూస్తే ఈసారి కూడా చ‌ర్చ‌లు ఫ‌ల‌వంత‌మ‌య్యే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. 

వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునే వ‌ర‌కు త‌మ ఆందోళ‌నను విర‌మించే ప్ర‌స‌క్తేలేద‌ని రైతు సంఘాల నాయ‌కులు తెగేసి చెబుతుండ‌గా, స‌వ‌ర‌ణ‌ల‌కు ఒప్పుకుంటాం త‌ప్ప చ‌ట్టాల‌ను పూర్తిగా ర‌ద్దుచేసే అవ‌కాశం లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇవాళ 10వ విడ‌త చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo