శనివారం 23 జనవరి 2021
National - Nov 29, 2020 , 12:33:18

రైతుల‌తో త‌క్ష‌ణ‌మే చ‌ర్చ‌లు జ‌రుపాలి: ఢిల్లీ మంత్రి స‌త్యేందర్ జైన్‌

రైతుల‌తో త‌క్ష‌ణ‌మే చ‌ర్చ‌లు జ‌రుపాలి: ఢిల్లీ మంత్రి స‌త్యేందర్ జైన్‌

న్యూఢిల్లీ: హ‌ర్యానా ప్ర‌భుత్వం రైతుల చ‌లో ఢిల్లీ ర్యాలీని అడ్డుకోవ‌డంపై ఢిల్లీ ఆరోగ్య‌మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ స్పందించారు. శాంతియుతంగా ఆందోళ‌న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన రైతుల‌ను అడ్డుకోవ‌డం క‌రెక్టు కాద‌న్నారు. రైతులకు వారు కోరుకున్న చోట ఆందోళ‌న నిర్వ‌హించే హ‌క్కు ఉంద‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తుంటే రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశాలు క‌‌నిపించ‌డం లేద‌ని జైన్ పేర్కొన్నారు. వారు మ‌న దేశానికి అన్నం పెడుతున్న రైతుల‌ని, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త‌క్ష‌ణ‌మే చ‌ర్చ‌లు జ‌రుపాల‌ని స‌త్యేంద‌ర్‌ జైన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo