భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

హైదరాబాద్ : కొత్త రకం వైరస్ భయాలు స్టాక్మార్కెట్లను తాకాయి. యూకే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా ఉద్దీపనపైనా మదుపరులకు నమ్మకం కుదరకపోవడంతో నష్టాలకు తోడైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా నష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 450 పాయింట్ల నష్టాల్లో ఉంది. ఒక దశలో రెండువేల పాయింట్లు సెన్సెక్స్ నష్టపోయింది. బ్రిటన్పై ఆంక్షల నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ బలహీన పడింది. కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో యూకేపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు 4 శాతానికి పైగా పడిపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్ 2037.61 పాయింట్లు (4.34 శాతం) పడిపోయి 44,923.08కు చేరింది. నిఫ్టీ బెంచ్మార్క్ 13,131.45 పాయింట్లకు చేరి.. 629.1 పాయింట్లు (4.57 శాతం) నష్టపోయింది. అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో మొబైల్, మెటల్ షేర్లపై అధిక ప్రభావం ఉంది.
ఇవి కూడా చదవండి..
హ్యంగోవర్ నుంచి తప్పించుకునే మార్గాలు తెలుసా?
ఒక్కసారిగా ఆపేస్తే ఆరోగ్యానికి ప్రమాదమే..!
జ్వరం వచ్చినప్పుడు తినకూడని ఆహార పదార్థాలేంటి..?
శృంగారానికి ముందు ఇవి తిన్నారంటే ఇరగదీస్తారు!
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
వ్యాక్సిన్లు.. వాటి పుట్టుక.. కొన్ని నిజాలు!
శృంగారం వల్ల కలిగే ప్రయోజనాలివే..
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ?
తాజావార్తలు
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్షిప్లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
- అత్యద్భుత సిరీస్ విజయాల్లో ఇదీ ఒకటి: సచిన్
- టీమిండియా విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు
- రకుల్ జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
- రిషబ్ పంత్ సూపర్ షో..