శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 09:14:27

కొడుకు పుట్టాడని పార్టీ.. అందులో ఒకరికి కరోనా

కొడుకు పుట్టాడని పార్టీ.. అందులో ఒకరికి కరోనా

బెంగళూరు : భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. ఈ క్రమంలో సభలు, సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశాయి. ఇదిలా ఉండగా బెంగళూరులోని బళ్లారి జిల్లాలో కంప్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పని చేస్తున్న వ్యక్తికి వారం రోజుల క్రితం కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాడనే సంతోషంలో పట్టణం సమీపంలోని ఓ గెస్ట్ హౌస్‌లో పోలీసు అధికారులకు, సిబ్బంది, తెలిసిన వారికి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి కంప్లి డివిజన్ సీఐతో సహా మరో 19 మంది పోలీసులు హాజరయ్యారు. ఆ పార్టీలో మద్యం సేవించిన ఓ కానిస్టేబుల్ అనారోగ్యానికి గురైయ్యాడు.

దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ పార్టీకి హాజరైన వారు కరోనా వైరస్ భయంతో హడలిపోతున్నారు. కంప్లి పోలీస్ స్టేషన్‌తో పాటు పార్టీ జరిగిన గెస్ట్ హౌస్‌ను సైతం వైద్యులు మూసి వేశారు. కరోనా కాలం ఎలాంటి పార్టీలు ఏమిటనిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo