సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 13:20:32

ముస్లిం ఇంట చిన్ని‘కృష్ణుడు’

ముస్లిం ఇంట చిన్ని‘కృష్ణుడు’

ఇండోర్ : మత సామరస్యానికి ప్రతీకగా మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో నివసిస్తున్న అజీజ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి 12 సంవత్సరాల క్రితం తన కుమారుడు కృష్ణాష్టమి రోజు పుట్టాడని కృష్ణా అని హిందూ పేరు పెట్టుకున్నాడు. ఈ పేరు పెట్టినందుకు మొదట్లో తన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తరువాత అంగీకరించారని ఖాన్ చెప్పారు. 

ఈ సందర్భంగా అజీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘‘12 సంవత్సరాల క్రితం 2008 ఆగస్టు 23న, నా భార్య ఒక పండంటి బాబుకు జన్మనిచ్చింది. డాక్టర్ ప్రవీణ్ జాడియా అప్పుడు శిశువు పేరును ఫారంలో నింపమని కోరాడు. ఆ రోజు శ్రీకృష్ణజన్మాష్టమి కావడంతో నేను వెంటనే మా అబ్బాయికి కృష్ణ అని పేరు పెట్టాను”. అని అన్నారు. వైద్యులు, కుటుంబ సభ్యులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, తండ్రిగా తన బిడ్డకు ఏ పేరైనా పెట్టుకునే హక్కు తనకు ఉందని ఆయన వారికి చెప్పినట్లు పేర్కొన్నారు. తన భార్య బాబుకు మరో ముస్లిం పేరు సూచించినా తాను మార్చలేదని ఖాన్‌ తెలిపాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo