బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 15, 2020 , 15:57:23

బెంగాల్‌ పరిస్థితి కాశ్మీర్‌ కంటే ఘోరం : బీజేపీ నేత

బెంగాల్‌ పరిస్థితి కాశ్మీర్‌ కంటే ఘోరం : బీజేపీ నేత

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి కాశ్మీర్‌ కంటే ఘోరంగా తయారైందని బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌ అన్నారు. ఆదివారం ఆయన ఉత్తర 24 పరగణ జిల్లాలోని బారానగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆరుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేశారని, రాష్ట్రంలో ఓ నెట్‌వర్క్‌ ఏర్పడిందని, బంగ్లాదేశ్‌ నాయకుడు ఖలీదా జియా సైతం ఉగ్రవాదులకు భారత్‌లో శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. బెంగాల్‌ ఉగ్రవాదులు, దేశ వ్యతిరేకులకు కేంద్రంగా మారిందన్నారు. తన పేరు కూడా దేశ వ్యతిరేకుల హిట్‌ జాబితాలో చేరిందని, రోహింగ్యా ముస్లింలను అలీపూర్‌దువార్‌ జిల్లాలోని జయగావ్‌లో తనపై జరిగిందని గుర్తు చేశారు.

ఘటన వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే వారిని గుర్తించవచ్చన్నారు. బెంగాల్‌లో రోహింగ్యాలు పుష్కలంగా ఉన్నారని, సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)కు ఓటు వేసే చొరబాటుదారులు ఉన్నారని ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదులు, సామాజిక వ్యతిరేక అంశాలకు ఆశ్రయం ఇవ్వడం ఆందోళకరమైన విషయమని, అయితే మిగతా పార్టీలన్నీ సమష్టిగా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసినా ‘ఏ పార్టీకి ఓటు వేయాలి’ అనే విషయం ప్రజలకు తెలుసునన్నారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో పోటీ చేయనున్నట్లు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటనపై మాట్లాడుతూ.. ఇంకా చాలా విషయాలు జరుగవచ్చన్నారు. 

అనేక రాజకీయ పార్టీలు ఇక్కడకు వచ్చి పోటీ చేస్తాయని, వాటిపై బీజేపీకి పట్టింపు లేదన్నారు. తమ పార్టీ మంచి వాతావరణాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. బెంగాల్‌లో 45శాతం మంది ప్రజలు బీజేపీకి ఓటు వేశారని, వారికి బీజేపీపై పూర్తి నమ్మకం ఉందన్నారు. అభివృద్ధిని కోరుకునే పార్టీ ఒక వైపు ఉంటుందని, అశాంతిని సృష్టించాలనుకునేది మరో వైపు ఉంటుందని వ్యాఖ్యానించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.