సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 21:39:25

ఆ పథకం ప్రచార రూ.393 కోట్లు!

ఆ పథకం ప్రచార రూ.393 కోట్లు!

న్యూఢిల్లీ : మహిళా సాధికారతతో రేషియో పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం ‘భేటీ బచావో.. భేటీ పడవో’. ఈ పథకం ప్రచారం కోసం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూ.393 కోట్లు ఖర్చు చేసినట్లు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం రాజ్యసభలో తెలిపింది. 2014 నుంచి ఇప్పటి వరకు చేసిన ఈ ఖర్చు పథకం ప్రచారానికి వినియోగించినుట్ల పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రయోజనం కోసం రూ .2367 కోట్లు ఖర్చు చేశారు. 2014-15లో రూ .189.91 కోట్లు, 2015-16లో రూ.54.54 కోట్లు, 2016-17లో రూ .29.79 కోట్లు, 2017-18లో రూ .135.71 కోట్లు, 2018-19లో రూ .160 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. పార్లమెంట్‌లో రాతపూర్వకంగా అడిగిన ఓ ప్రశ్నకు మహిళా శిశు మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ‘లింగ వివక్ష నిర్మూలన, ఆడపిల్లల మనుగడ మరియు రక్షణ కల్పించడం. బాలికలకు విద్య అందేలా చూడడం’ అనే మూడు ప్రధాన ఉద్దేశాలతో దీన్ని ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo