మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 26, 2020 , 13:58:43

భార‌త్‌-శ్రీలంకది‌ వేల ఏండ్ల బంధం: ప‌్ర‌ధాని మోదీ

భార‌త్‌-శ్రీలంకది‌ వేల ఏండ్ల బంధం: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: భార‌త్‌-శ్రీలంక దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న బంధం ఈనాటిది కాద‌ని, వేల ఏండ్ల నాటిద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. భార‌త్‌-శ్రీలంక ప్ర‌ధానుల మ‌ధ్య‌ వ‌ర్చువ‌ల్ మీటింగ్ సంద‌ర్భంగా ప్ర‌ధాని ఈ వ్యాఖ్య చేశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల‌పై వ‌ర్చువ‌ల్ రీతిలో చ‌ర్చిద్దామ‌న్న త‌న ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రించినందుకు శ్రీలంక ప్ర‌ధాని రాజ‌ప‌క్షేకు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అదేవిధంగా శ్రీలంక పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌ధాని అయినందుకు రాజ‌ప‌క్షేను అభినందించారు. 

శ్రీలంక‌తో సంబంధాలకు తాము ఎప్పుడైనా ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇస్తామ‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా రెండు దేశాల‌కు సంబంధించిన పలు కీల‌క అంశాల‌పై ప్ర‌ధానులు ఇద్ద‌రూ చ‌ర్చించారు. క‌రోనా ప‌రిస్థితుల్లో సైతం భార‌త్ త‌మ దేశానికి అందించిన స‌హ‌కారానికి కృత‌జ్ఞ‌త‌లు అని శ్రీలంక ప్ర‌ధాని పేర్కొన్నారు. ఎంటీ న్యూ డైమండ్ నౌక‌లో చెల‌రేగిన మంట‌లు ఇరుదేశాల మ‌ధ్య గొప్ప స‌హ‌కారానికి అవ‌కాశం క‌ల్పించాయ‌ని రాజ‌ప‌క్షే అభిప్రాయ‌ప‌డ్డారు.       

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.