బుధవారం 08 జూలై 2020
National - Jun 26, 2020 , 16:06:42

ప్రధాని భయపడకుండా నిజం చెప్పాలి : రాహుల్‌ గాంధీ

ప్రధాని భయపడకుండా నిజం చెప్పాలి : రాహుల్‌ గాంధీ


చైనా వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా విమర్శలు చేశారు. లడఖ్‌లోని గాల్వన్‌లోయలో భారత సైన్యంలోని 20 మంది సైనికులు అమరులయ్యారు. అప్పటి నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ శుక్రవారం ట్విట్టర్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ప్రధాని భయపడకుండా నిజం చెప్పాలని కోరారు.  

రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ దేశం మొత్తం సైన్యం, ప్రభుత్వంతో ఐక్యంగా నిలుస్తుంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తింది. కొద్ది రోజుల క్రితం మన ప్రధానమంత్రి ఎవరూ భారతదేశానికి రాలేదని, మన భూమిని ఎవరూ తీసుకోలేదని చెప్పారు. కానీ ఈ చిత్రంలో ఉపగ్రహం కనిపించినట్లు మాజీ ఆర్మీ జనరల్‌ చెబుతున్నారన్నారు.  చైనా మన భూమిని ఒకటి కాకుండా మూడు ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నట్లు లడఖ్‌ ప్రజలు చెబుతున్నారని రాహుల్‌ గాంధీ అన్నారు. 

 ప్రధాని మీరు నిజం చెప్పాలి. భయపడాల్సిన అవసరం లేదని రాహుల్‌ అన్నారు. భూమి పోలేదని, కానీ చైనా ఆ భూమిని తీసుకుందని మీరు చెబితే.. చైనాకు ప్రయోజనం ఉంటుంది. మనం కలిసి పోరాడాలి అని అన్నారు. అదేవిధంగా అమరువీరులైన మన సైనికులకు ఆయుధాలు లేకుండా సరిహద్దుకు ఎందుకు పంపారో తెలియజేయాలని ప్రశ్నించారు. 


logo