గురువారం 21 జనవరి 2021
National - Nov 26, 2020 , 15:16:50

మారాడోనా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

 మారాడోనా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

ఢిల్లీ : ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు డియగో మారాడోనా హఠాన్మరణం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి  న‌రేంద్ర మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు. ‘‘ డియ‌గో మారాడోనా ఓ ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు. ఆయన ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జాద‌ర‌ణ పొందారు. తన వృత్తి జీవ‌న పర్యంతం ఫుట్ బాల్ మైదానం లోఅద్భుతమైన ఆటను ప్రదర్శించి, ఆయన మనకు కొన్ని అత్యుత్త‌మ జ్ఞాపకాలు అందించారు. ఆయ‌న అకాల మ‌ర‌ణంతో మ‌నం అంద‌రం ఎంతో దుఃఖిస్తున్నాము.  ఆయ‌న ఆత్మ‌కు శాంతి ల‌భించు గాక’’ అని ప్ర‌ధాన మంత్రి  నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo