శనివారం 23 జనవరి 2021
National - Nov 25, 2020 , 17:21:17

రేపు ఆర్.ఈ-ఇన్వెస్ట్ 2020 సదస్సును ప్రారంభించనున్న ప్రధానమంత్రి

 రేపు ఆర్.ఈ-ఇన్వెస్ట్ 2020 సదస్సును ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ఢిల్లీ: 3వ అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన పెట్టుబడి సమావేశం (ఆర్‌.ఈ-ఇన్వెస్ట్ 2020) ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు నవంబర్ 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగుతుంది."సస్టైనబుల్ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఆవిష్కరణలు" అనే థీమ్ తో ఆర్‌.ఈ-ఇన్వెస్ట్ 2020 సదస్సును నిర్వహిస్తున్నారు.

ఈ సదస్సులో భాగంగా, పునరుత్పాదక ,భవిష్యత్తు ఇంధన ఎంపికల పై మూడు రోజులు సమావేశాలతోపాటు, తయారీదారులు, డెవలపర్లు, పెట్టుబడిదారులు , ఆవిష్కర్తల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నారు.  ఈ సదస్సులో 75 మందికి పైగా అంతర్జాతీయ మంత్రుల స్థాయి ప్రతినిధులు, 1000 మందికి పైగా ప్రపంచ పరిశ్రమల అధిపతులు, 50,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo