ఆదివారం 29 మార్చి 2020
National - Feb 12, 2020 , 02:27:32

భారతదేశ ఆత్మను కాపాడారు

భారతదేశ ఆత్మను కాపాడారు
  • ఢిల్లీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్‌ కిశోర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌)కి  ఘన విజయాన్ని అందించడం ద్వారా ఢిల్లీ ప్రజలు భారతదేశ ఆత్మను కాపాడారని ఎన్ని కల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను మంగళవారం కలుసుకు న్నారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్‌ కిశో ర్‌తో ఆప్‌ గతంలోనే ఒక ఒప్పందాన్ని కుదుర్చు కుంది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీతో ఘర్షణాత్మక వైఖరికి దిగవద్దని కేజ్రీవాల్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ సూచించారని సమాచారం. ఢిల్లీలో చేపట్టిన అభివృద్ధి పనులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి అంశాలపైనే ప్రచారాన్ని కేంద్రీకరించాలని చెప్పినట్లు వినికిడి. అందువల్లే ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయకుండా ఆప్‌ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం.. బీజేపీ మద్దతుదారులు కూడా భారీ సంఖ్యలో ఆప్‌కు ఓటేయడానికి కారణమైందని తెలుస్తున్నది. logo