సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:04:50

సంస్కృతంలో సురినా అధ్యక్షుడి ప్రమాణం

సంస్కృతంలో సురినా అధ్యక్షుడి ప్రమాణం

న్యూఢిల్లీ: దక్షిణ అమెరికా దేశం సురినాం నూతన అధ్యక్షుడు, భారత సంతతి వ్యక్తి చంద్రికాపర్సాద్‌ సంతోకీ సంస్కృతంలో అధ్యక్షుడిగి ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. వేదాలను చేతపట్టుకొని వేద మంత్రాలు ఉచ్చరిస్తూ ఆయన ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ వీడియో సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతున్నది. ఒక విదేశీ నేత సంస్కృతంలో ప్రమాణం చేయటంపై భారతీయ నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. సురినాం అధ్యక్షుడు వేదాల సాక్షిగా ప్రమాణం చేయటం భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. దెసీ బౌటెర్స్‌ స్థానంలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. logo