ఆదివారం 07 జూన్ 2020
National - Mar 31, 2020 , 22:31:54

ఏపీలో 44కి చేరిన క‌రోనా బాధితుల సంఖ్య‌

ఏపీలో 44కి చేరిన క‌రోనా బాధితుల సంఖ్య‌

ఏపీలోనూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది.  ఉదయం 17 కేసులు నమోదు గాకా.. సాయంత్రం 6 తర్వాత మరో నాలుగు పాజిటివ్ వచ్చాయి. ఆ నలుగురూ విశాఖకు చెందిన వారని ఏపీ వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. వీరు కూడా ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరయ్యార‌ని తెలిపింది. మొత్తంగా ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి వరకు మొత్తం 44 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం 42 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. విశాఖపట్టణంలో ఒకరు, నెల్లూరులో ఒకరు వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అత్యధికంగా ప్రకాశం 11, విశాఖపట్టణం10, గుంటూరులో9 నమోదయ్యాయి.


logo