ఆదివారం 07 జూన్ 2020
National - Apr 01, 2020 , 22:48:15

ఏపీలో 111కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌

ఏపీలో 111కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. మ‌ళ్లీ కొత్త‌గా 24 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు ఏపీ అధికారులు క‌రోనా హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య  111కి చేరుకుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 69 కేసులు న‌మోదు కావ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న నెల‌కొంది.  గుంటూరు జిల్లాలోనే అత్య‌ధికంగా 20 కేసులు న‌మోదయ్యాయి. క‌డ‌ప 15, కృష్ణా 15, ప్ర‌కాశం 15, ప‌.గో 14, విశాఖ 11, తూ.గో జిల్లాలో 11 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. చిత్తూరు 6, నెల్లూరు 3, అనంత‌పురం 2, క‌ర్నూలు జిల్లాలో ఒక్క‌రికి క‌రోనా సోకింది. మొత్తం ఇవాళ న‌మోదైన కేసుల‌తో తెలంగాణ కంటే ఏపీలోనే క‌రోనా బాధితుల సంఖ్య పెరిగింది.


logo