బుధవారం 20 జనవరి 2021
National - Jan 11, 2021 , 19:22:27

15న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు: తోమర్‌

15న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు: తోమర్‌

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు ఈ నెల 15న జరుపుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ విడత చర్చల్లో సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ చట్టాల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆయన అన్నారు. 

మరోవైపు వ్యవసాయ చట్టాలు, రైతుల నిరసనల పట్ల మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాలను కేంద్రం నిలిపివేస్తుందా లేక తామే ఆ పని చేయాలా అంటూ మండిపడింది. 

వ్యవసాయ చట్టాల రాజ్యాంగ ప్రామాణికతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయనున్నది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo