సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 23:21:50

త్వరలో కియా మోటార్స్ నుంచి సరికొత్త వాహనం

త్వరలో కియా మోటార్స్ నుంచి సరికొత్త వాహనం

న్యూఢిల్లీ : కియా మోటార్‌ కార్పోరేషన్‌ అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్‌ ఇండియా తమ కియా సోనెట్‌ కంపాక్ట్‌ ఎస్‌యువీ అఫీషియల్ దయాగ్రామ్ ను విడుదల చేసింది. ఢిల్లీ ఆటో ఎక్స్‌పో -2020 వద్ద దీని  ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌తో విడుదల చేసింది. నూతన చిత్రంతో, సోనెట్‌ ఇప్పుడు నూతన డిజైన్‌ బెంచ్‌మార్క్స్‌ను సృష్టించడమే లక్ష్యంగా   కంపాక్ట్‌ ఎస్‌యువీ విభాగంలో ఈ వేసవి తరువాత విడుదల చేయ డానికి   సిద్ధమైంది. ఈ బ్రాండ్‌ శక్తివంతమైన డీఎన్‌ఏను సోనెట్‌  రేఖాచిత్రం పునరుద్ఘాటిస్తుంది. ఎమోటివ్‌ డిజైన్‌ను ప్రీమియం, యువతరం అభిరుచితో మిళితం చేయడం ద్వారా బలీయమైన ఆన్‌–రోడ్‌ ఉనికిని సృష్టిస్తుంది. 

కంపాక్ట్‌ ఎస్‌యువీ బోల్డ్‌ డిజైన్‌, కియా సిగ్నేచర్‌ డిజైన్లు అయినటువంటి  బలీయమైన విజువల్‌ ఇంప్రెషన్‌ కోసం త్రికోణాకార స్టెప్‌వెల్‌ జియోమెట్రిక్‌ గ్రిల్‌ మెష్‌ సుప్రసిద్ధ టైగర్‌ నోస్‌ గ్రిల్‌తో మిళితం చేస్తుంది. సిగ్నేచర్‌ గ్రిల్‌లో కార్‌ భారతీయ స్ఫూర్తి ప్రభావమూ ప్రదర్శిస్తుంది. కియా నుంచి రెండవ మేడ్‌ ఇన్‌ ఇండియా కారుగా సోనెట్‌ నిలుస్తుంది. తొలుత కియా సెల్టోస్‌ను పరిచయం చేశారు. ఈ నూతన మోడల్‌ అంతర్జాతీయంగా వినియోగదారులను ఆకట్టుకోనున్నది. వచ్చే  పండుగ సీజన్‌లో తొలుత భారతీయ మార్కెట్‌లో ఇది ప్రవేశించనుంది. 

అనంతరం  అంతర్జాతీయంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. నూతన కియా సోనెట్‌ను సాంకేతికత పట్ల అభిరుచి తో కనెక్ట్‌ అయి ఉండే యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని విడుదల చేశారు. ఆగస్టు 7 న ప్రపంచవ్యాప్తంగా సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీని ఆవిష్కరించబోతున్నది. మంచి పనితీరు కనబరిచే వాహనాన్ని అందించాలనే ఆశయం మాకు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రత్యేకమైన స్పోర్టి ఆటిట్యూడ్ తో గొప్ప ఎస్‌యూవీ అని మేము నమ్ముతున్నాం " అని కియా మోటార్స్ కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్  కియా డిజైన్ సెంటర్ హెడ్ కరీం హబీబ్ అన్నారు.


logo