సోమవారం 06 జూలై 2020
National - Jun 21, 2020 , 06:22:38

రాజ్య సభలో ఎన్డీయే మరింత పటిష్ఠం

రాజ్య సభలో ఎన్డీయే మరింత పటిష్ఠం

న్యూఢిల్లీ : రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరిగింది. శుక్రవారం 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌, వైసీపీకి చెరో నాలుగు రాగా, ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నారు. తాజా ఫలితాలతో బీజేపీ సభ్యుల సంఖ్య 86 కు చేరింది. మొత్తంగా ఎన్డీయే 100 సీట్లతో ఆధిపత్యం కొనసాగిస్తున్నది.

మొత్తం 245 సభ్యులతో కూడిన పెద్దల సభలో కాంగ్రెస్‌ 41 సీట్లు ఉన్నాయి. బీజేపీకి అన్నాడీఎంకే 9, బీజేడీ 9, వైసీపీకి చెందిన ఆరుగురు సహా ఇతర పార్టీలు, నామినేటెడ్‌ సభ్యులు బిల్లుల సమయంలో మద్దతు తెలిపితే మోదీ సర్కారుకు ఎదురు ఉండకపోవచ్చు.

కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 61 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా అందులో 43 మంది రాజ్యసభకు కొత్తగా ఎన్నికయ్యారు. అందులో బీజేపీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే కూడా ఉన్నారు. వీరిద్దరు అంతకుముందు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు.


logo