గురువారం 26 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 13:08:54

షిప్పింగ్ శాఖ పేరులో మార్పు: ప‌్ర‌ధాని మోదీ

షిప్పింగ్ శాఖ పేరులో మార్పు: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ‌షిప్పింగ్ శాఖ పేరును మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్‌, షిప్పింగ్ అండ్ వాట‌ర్‌వేస్‌గా మారుస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తెలిపారు. ఈ ఉద‌యం ప్ర‌ధాని మోదీ గుజ‌రాత్‌లోని సూర‌త్‌-సౌరాష్ట్ర మ‌ధ్య రోపాక్స్ ఫెర్రీ స‌ర్వీస్‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ పేరును మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్‌, షిప్పింగ్ అండ్ వాట‌ర్‌వేస్‌గా మార్చుతున్న‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల విద్యాశాఖ‌ పేరును కూడా మార్చింది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమ‌న్ రిసోర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ (HRD మినిస్ట్రీ)‌గా ఉన్న పేరును కేంద్ర విద్యాశాఖ‌గా మార్చారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.