సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 02:11:19

వాట్సాప్‌లో డిసపియరింగ్‌ ఫీచర్‌!

వాట్సాప్‌లో డిసపియరింగ్‌ ఫీచర్‌!

న్యూఢిల్లీ: మీ వాట్సాప్‌ ఖాతాలో కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు వచ్చి చేరుతున్నాయా? వందలాది మెసేజ్‌లను తొలగించడం కష్టంగా మారిందా? వీటికి పరిష్కారాన్ని చూపుతూ ‘వాట్సాప్‌'  కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. చాటింగ్‌ మెసేజీలు వాటంతట అవే అదృశ్యమయ్యేలా ‘డిసపియరింగ్‌ మెసేజెస్‌' పేరిట ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఏడు రోజుల అనంతరం మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్‌ అవుతాయి. ఈ ఫీచర్‌ కావాల్సినవారు సెట్టింగ్స్‌లోని ‘డిసపియరింగ్‌ మెసేజెస్‌' ఐకాన్‌ను ఆన్‌ చేయాల్సి ఉంటుందన్నారు. వాట్సాప్‌ గ్రూపుల్లో అయితే అడ్మిన్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ నెలలోనే ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.