సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 17:32:07

నూతన విద్యా విధానాన్ని ఆమోదించిన మోడీ ప్రభుత్వం

నూతన విద్యా విధానాన్ని ఆమోదించిన మోడీ ప్రభుత్వం

న్యూ ఢిల్లీ : కొత్త విద్యా విధానాన్ని మోడీ ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. 34 సంవత్సరాల తరువాత భారతదేశంలో ప్రభుత్వం కొత్త విద్యా విధానం తెచ్చింది. పాఠశాల-కళాశాల వ్యవస్థలో పెద్ద మార్పులు చేసింది. 

ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త విద్యా విధానాన్ని ఆమోదించామన్నారు. 34 సంవత్సరాలుగా విద్యా విధానంలో మార్పు లేదని, విద్యా విధానానికి సంబంధించి ప్రభుత్వం 2 కమిటీలను ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి చెప్పారు. ఒకటి ఎస్‌ఆర్ సుబ్రమణియన్ కమిటీ, మరొకటి డాక్టర్ కె కస్తూరిరంగన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

కొత్త విద్యా విధానం కోసం పెద్ద ఎత్తున సలహాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 6600 బ్లాక్‌లు, 676 జిల్లాలను సంప్రదించినట్లు తెలిపారు. కొత్త విద్యా విధానం ప్రకారం ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరొక కోర్సు తీసుకోవాలనుకుంటే, అతను మొదటి కోర్సు నుంచి పరిమిత సమయం వరకు విరామం తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo