శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 16:10:38

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ ను ఇలా లింక్ చేసుకోవచ్చు

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ ను ఇలా లింక్ చేసుకోవచ్చు

హైదరాబాద్: ప్రస్తుతం అనేక ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డు చాలా  ముఖ్యం. అంతేకాదు...ఆధార్ కార్డుకు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోవడం చాలా అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. అందుకే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. మరి మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉందా? గతంలో లింక్ చేసిన నెంబర్ ఇప్పుడు పనిచేస్తుందా? కొత్త మొబైల్ నెంబర్‌ను లింక్ చేయాలా? చాలావరకు సేవల్ని ఆన్‌లైన్‌లోనే పొందే అవకాశం ఇస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా.

కానీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రం ఆధార్ కార్డు హోల్డర్లు పర్మనెంట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. ఆధార్ సేవా కేంద్రాలకు కూడా వెళ్లి మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయడం సాధ్యం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే దగ్గర్లోని ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ కరెక్షన్ ఫామ్ పూర్తి చేయాలి. అందులో మీరు వినియోగిస్తున్నమొబైల్ నెంబర్‌ను యాడ్ చేయాలి.

దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసి ఆథెంటికేషన్ కోసం మీ బయోమెట్రిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ వస్తుంది. అందులో అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్-URN ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా మీ ఆధార్ అప్‌డేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొత్తగా మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయాలన్నా, పాత నెంబర్ తొలగించి కొత్త నెంబర్ అప్‌డేట్ చేయాలన్నా ప్రాసెస్ ఇలాగే ఉంటుంది.

తాజావార్తలు


logo