ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 17:53:05

గణేశ్ విగ్రహాల ఎత్తు.. నాలుగు అడుగులు మించకూడదు

గణేశ్ విగ్రహాల ఎత్తు.. నాలుగు అడుగులు మించకూడదు

ముంబై: కరోనా నేపథ్యంలో గణేశ్ విగ్రహాల ఎత్తుపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మండపాల్లో ఏర్పాటు చేసే వినాయకుడి విగ్రహాల ఎత్తు 4 అడుగులు మించకూడదని స్పష్టం చేసింది. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో పలు నిబంధనలను పేర్కొంటూ ఆ రాష్ట్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గణేశ్ మండపాల నిర్వాహకులు విధిగా స్థానిక అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని పేర్కొంది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను మండపాల నిర్వాహకులు తప్పక పాటించాలని వెల్లడించింది.

మహారాష్ట్రలో ప్రతి ఏటా గణేశ్ ఉత్సవాలను చాలా ఆడంబరంగా జరుపుతారు. గణేశ్ మండపాల నిర్వాహకులు పోటాపోటీగా పెద్ద ఎత్తు విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా వల్ల గణేశ్ విగ్రహాల ఎత్తుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 2.31 లక్షలకు చేరగా వైరస్ బారినపడి ఇప్పటి వరకు 9,667 మంది మరణించారు.
logo