శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 10:35:32

గుజరాత్‌లో కరోనా కేర్ సెంట‌ర్‌గా మసీదు

గుజరాత్‌లో కరోనా కేర్ సెంట‌ర్‌గా మసీదు

వడోదర : గుజరాత్‌ రాష్ట్రం గోద్రాలోని ఒక మసీదు కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మారింది. గత కొద్ది రోజులుగా గుజరాత్‌లో క‌రోనా వైరస్ అంత‌కంత‌కూ వ్యాప్తి చెందుతోంది. కరోనా బారిన పడి ఎంతో మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో కొత్త రోగులకు దవాఖానల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో గోద్రాలోని ఒక మసీదు కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మార్చి  అందులోని ఒక ఫ్లోర్‌ను క‌రోనా బాధితుల కోసం కేటాయించారు. ఇక్కడ ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన 9 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఈ మసీదులోని గ్రౌండ్ ఫ్లోర్‌ను ముస్లిం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు ఇక్కడ ఉండటానికి అన్ని వ‌స‌తులు క‌ల్పించారు. ఇప్పుడు దీనినే కరోనా కేర్‌ సెంటర్‌గా మార్చారు. గుజరాత్‌లో పెరుగుతున్న కరోనా రోగుల దృష్ట్యా మసీదు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo