సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 13:25:49

బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ప్లాన్

బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ప్లాన్

హైదరాబాద్ : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బిఎస్ఎన్ఎల్) మరో సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.399 రీఛార్జ్ ఓచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 80 రోజులు. కాల్, డేటా బెనిఫిట్స్ లభిస్తాయి. రోజూ 250 నిమిషాలు లోకల్, ఎస్‌టీజీ, ఔట్ గోయింగ్ రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. హోమ్, నేషనల్ రోమింగ్ లాంటి కాల్స్ అన్నీ వర్తిస్తాయి. 250 నిమిషాల లిమిట్ తర్వాతబేస్ టారిఫ్ ప్లాన్ ప్రకారం కాల్ ఛార్జీలు ఉంటాయి. ఇక ఈ ప్లాన్‌తో 1జీబీ డేటా కూడా లభిస్తుంది. డేటా లిమిట్ పూర్తైన తర్వాత 80కేబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, ఉచితంగా బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, ఉచితంగా లోక్‌ధున్ కంటెంట్ పొందవచ్చు. \

ఈ కొత్త ప్లాన్ ఆగస్ట్ 15 నుంచి అందుబాటులో ఉంటుంది. సబ్‌స్క్రైబర్లు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్, సీ-టాపప్ ద్వారా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. SMS PLAN BSNL399 అని టైప్ చేసి 123 నెంబర్‌కు పంపి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఇండిపెండెన్స్ డే సందర్భంగా రూ.147 ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.147 ప్లాన్‌పై 250 నిమిషాల వరకు లోకల్, ఎస్‌టీడీ వాయిస్ కాల్స్, 10జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు. ఈ ఆఫర్‌తో పాటు రూ.247 ప్లాన్‌పై 6 రోజులు, రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 74 రోజులు వేలిడిటీని పొడిగించింది బీఎస్ఎన్ఎల్. అంటే రూ.247 ప్లాన్‌పై 36 రోజులు, రూ.1,999 ప్లాన్‌పై 439 రోజుల వేలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్స్‌పై ఎరాస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నది. 30 రోజుల వరకు ఎరాస్ నౌ కంటెంట్ ఉచితంగా చూడవచ్చు.


logo