ఆదివారం 12 జూలై 2020
National - Jun 19, 2020 , 12:36:28

జవాన్‌ జైకిశోర్‌ సింగ్‌కు అశ్రునివాళి..

జవాన్‌ జైకిశోర్‌ సింగ్‌కు అశ్రునివాళి..

వైశాలి : భారత్‌, చైనా మధ్య గాల్వన్‌లో జరిగిన ఘర్షణలో బిహార్‌ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన జై కిశోర్‌సింగ్‌ అమరుడయ్యారు. కిశోర్‌సింగ్‌ అంత్యక్రియలను శుక్రవారం అతడి సొంత జిల్లా వైశాలిలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా సైనిక దళం ఆయనకు ఆర్మీ సంప్రదాయం ప్రకారం నివాళులర్పించింది. కిశోర్‌సింగ్‌ అంతిమయాత్రకు భారీగా జనం తరలిరావడంతో ఆంక్షల నడుమ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చిన్నవయస్సులోనే ఆర్మీలో చేరి దేశం కోసం ప్రాణాలొదిలిన జై కిశోర్‌సింగ్‌ను తలుచుకొని తోటీ సైనికులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కిశోర్‌సింగ్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 


logo