బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 10, 2020 , 22:56:46

స్వావలంబన కలిగిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ప్రధాన మంత్రి మోదీ

స్వావలంబన కలిగిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ప్రధాన మంత్రి  మోదీ

ఢిల్లీ : ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ బిహార్ లో ‘పిఎం మత్స్య సంపద యోజన’, ‘ఇ-గోపాల యాప్’ లతో పాటు చేపల ఉత్పత్తి కి సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ...ఈ రోజు న ప్రారంభించిన ఈ పథకాలన్నింటి వెనుక ఉన్న ఉద్దేశం మన రైతులకు సాధికారత ను కల్పించి, భారతదేశాన్ని 21వ శతాబ్దం లో స్వావలంబన కలిగిన దేశం (ఆత్మనిర్భర్ భారత్) గా తీర్చిదిద్దడమేనని" అన్నారు.‘మత్స్య సంపద యోజన’ ను కూడా ఇదే ఉద్దేశంతో ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.  దేశం లో 21 రాష్ట్రాల లో దీనిని ప్రారంభిస్తున్నట్లు, రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఆ రాష్ట్రాలలో ఈ పథకం కోసం 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి ని పెడుతున్నట్లు ఆయన వివరించారు. 

1700 కోట్ల రూపాయల విలువైన పథకాలకు ఈ రోజు న శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఈ పథకం లో భాగం గా పాట్నా, పూర్ణియా, సీతామఢీ, మధేపురా, కిషన్ గంజ్, సమస్తీపుర్ లలో అనేక సదుపాయాలను ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం చేపల ఉత్పత్తిదారులకు సరికొత్త మౌలిక సదుపాయాలను, ఆధునిక పరికరాలను, కొత్త మార్కెట్ లను అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.  వీటితో పాటు సాగు ద్వారా, ఇతర మార్గాల ద్వారా లభించే అవకాశాలు కూడా పెరుగుతాయి అని ఆయన చెప్పారు. స్వాతంత్యం వచ్చిన తరువాత, దేశం లో చేపల రంగం కోసం ఇంత భారీ పథకాన్ని ప్రారంభించడం ఇదే మొట్టమొదటి సారి అని ఆయన అన్నారు.


logo