గురువారం 02 జూలై 2020
National - Jun 23, 2020 , 14:18:40

గాడిదల స్నేహం అంటే ఇదేనా?!

గాడిదల స్నేహం అంటే ఇదేనా?!

ప్రస్తుతం ఇద్దరు స్నేహితుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ వారి స్నేహాన్ని సరదాగా ప్రేమిస్తున్నారు. జంతు వీడియోలను చూసే వారికి ఈ వీడియో చాలా నచ్చుతుందని చెప్పవచ్చు. గాడిదల సంరక్షణ కేంద్రంలోని ఫ్లాప్‌జాక్, హోరాసియో అనే రెండు గాడిదల ఫ్రెండ్‌షిప్‌ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

డాంకీ సాంక్చురీ తన అధికారిక ట్విట్టర్ పేజీలో నిమిషం కంటే ఎక్కువ నిడివి ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రెండు గాడిద స్నేహితులు వేర్వేరు బొమ్మలు, బేబీ బూట్లతో ఆటాడుకొంటూ ఆనందిస్తున్నాయి. ఈ వీడియో జూన్ 18 న షేర్ చేయగా ట్విట్టర్‌లోనే 24,400 కన్నా ఎక్కువ మంది వీక్షించారు. ఈ గాడిదల స్నేహాన్ని చూసి ఎంతో ఆనందింస్తున్నామని, మన ముఖాలపై చిరునవ్వును తెప్పిస్తున్నాయని పలువురు జంతు ప్రేమికులు కామెంట్లు పోస్ట్ చేశారు. చాలా మంది వ్యాఖ్యలకు బదులుగా లవ్‌ ఎమోజీలను పంచి తమ ప్రేమను ప్రదర్శించారు.

గ్రేట్ బ్రిటన్లో గాడిద శతాబ్దంలో గాడిదలకు స్వేచ్ఛగా జీవించే అవకాశం లభిస్తుండటం విశేషం. గాడిదలకు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తారు. కొవిడ్ -19 మహమ్మారి కారణంగా గాడిదలను సంక్రమణ నుండి రక్షించడానికి గాడిదల సాంక్చురీని ప్రస్తుతం మూసి వుంచారు. మీరూ ఈ గాడిదల స్నేహం వీడియోను చూసి ఆనందించండి.logo