ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 02:30:11

నవ భారత్‌కు పునాది

నవ భారత్‌కు పునాది

  • l నూతన విద్యావిధానంతో విద్యావిప్లవం
  • l ఆజ్ఞాపత్రం కాదు.. మహాయజ్ఞం
  • l ప్రధాని నరేంద్రమోదీ వెల్లడి 

న్యూఢిల్లీ, ఆగస్టు 7: నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ) నూతన భారతదేశానికి పునాది వేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో విద్యార్థులకు ఎలా ఆలోచించాలో నేర్పుతుందని చెప్పారు. అన్నిదేశాలు తమ విద్యావిధానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటుంటే 30 ఏండ్లుగా భారత విద్యావిధానంలో ఎలాంటి మార్పు లేదని ఈ నేపథ్యంలోనే ఎన్‌ఈపీని తెచ్చామన్నారు. ‘ప్రస్తుత విద్యావిధానం దేనిగురించి ఆలోచించాలి అని నేర్పుతున్నది. నూతన విద్యావిధానం ఎలా ఆలోచించాలి అని’ నేర్పుతుంది అని పేర్కొన్నారు. ‘జాతీయ విద్యావిధానం పరిధిలో ఉన్నత విద్యలో పరిణామాత్మక సంస్కరణలు’అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. నూతన విద్యావిధానం ఒక ప్రాంతం, ఒక వర్గం అని తేడాలేకుండా దేశంలోని అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు.

చేతివృత్తులకు గొంతునివ్వండి

న్యూఢిల్లీ: భారతీయ చేతివృత్తుల నైపుణ్యాలకు ప్రచారం కల్పించాలని ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రలు పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానితోపాటు పలువురు కేంద్రమంత్రులు భారతీయ చేతివృత్తుల వైభవాన్ని గుర్తుచేస్తూ సోషల్‌మీడియాలో సందేశాలు పోస్ట్‌ చేశారు.


logo