సోమవారం 13 జూలై 2020
National - Jun 24, 2020 , 09:18:44

మాస్కు ధరించకపోతే మొదటిసారి రూ.500, రెండోసారి రూ.1000 జరిమానా

మాస్కు ధరించకపోతే మొదటిసారి రూ.500, రెండోసారి రూ.1000 జరిమానా

న్యూ ఢిల్లీ : ఢిల్లీలో వేలల్లో కరోనా కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఇప్పటికే మాస్కు ధరించకుండా బయటికి రావొద్దని మార్గనిర్దేశకాలు జారీ చేసినా కొంతమంది బేఖాతరు చేస్తున్నారు. మాస్కు, శానిటైజర్‌, భౌతికదూరం పాటించడం..  వీటి ద్వారానే కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని ఘంటాపథంగా చెబుతున్నా చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు ఢిల్లీలో సంభవిస్తున్నాయి. ఢిల్లీలో బుధవారం పోలీసులు మాస్కులు ధరించని వారికి జరిమానా విధించారు. సెక్షన్‌ 188లో భాగంగా మొదటిసారి మాస్కు ధరించకుండా బయట తిరిగితే రూ.500, రెండోసారికి రూ.1000 జరిమానా విధిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 


logo