బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 11:20:52

హైదరాబాద్‌లో మొట్టమొదటి ఆన్‌లైన్‌ ఎగ్జిబిషన్‌

హైదరాబాద్‌లో మొట్టమొదటి ఆన్‌లైన్‌ ఎగ్జిబిషన్‌

హైదరాబాద్‌ : అల్ హాడి ఇస్లామిక్ ఎక్స్‌పో, సూపర్ ముస్లిమా మొట్టమొదటి ఆన్‌లైన్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శన ఫ్యాషన్, ఆహారం, జీవనశైలిని నేపథ్యంలో ఉంటుంది. ఈ ప్రదర్శన జూలై 15 నుంచి 25 వరకు ఉంటుంది. పది రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన అంతా సరదాగా, ఆనందంగా ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. 

ఇందులో ఉపకరణాలు, అలంకరణలతో కూడిన వస్తువులు, దుస్తులు, ఆహారం, బేకరీ వస్తువులు, బిర్యానీలు కూడా ఉంటాయి. వినియోగదారులకు  ఎగ్జిబిషన్‌లో 100కుపైగా డిజైనింగ్‌ వస్త్రాలను అందించడంతో పాటు, చక్కగా అలంకరించిన వస్తువులను కూడా అందులో ఉంటుంది.  కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఆన్‌లైన్‌ ఎగ్జిబిషన్‌ అందరినీ ఆకట్టుకుంటుందని తాము అనుకుంటున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. మనకు కావాల్సిన వస్తువును స్క్రీన్‌ షాట్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్ నెంబర్‌కు పంపాలని, ఆ వస్తువును తమ సిబ్బంది హోం డెలివరీ చేస్తారని నిర్వాహకులు తెలిపారు. 

తాజావార్తలు


logo