శనివారం 30 మే 2020
National - May 06, 2020 , 21:34:33

మే 20వ తేదీ నుంచి 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

మే 20వ తేదీ నుంచి 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

ప‌నాజీ: కోవిడ్ -19,  లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా పడిన ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ ప్ర‌క‌టించారు. గోవా బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌, గోవా బోర్డ్ ఆఫ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ ప‌రీక్ష‌ల తేదీలు నిర్ణ‌యించామ‌న్నారు. 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 20వ తేదీ నుంచి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 21వ తేదీ నుంచి నిర్వ‌హిస్తామ‌న్నారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఏర్పాట్లు చేయాల‌ని ఇప్ప‌టికే అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. విద్యార్థులు ప‌రీక్ష కేంద్రాల‌కు చేరుకునేందుకు, ప‌రీక్ష కేంద్రాల్లో బౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. విద్యార్థుల త‌ల్లిదండ్రులు కూడా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 


logo