మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 14, 2020 , 13:07:09

నిత్యావసర వస్తువుల సవరణ బిల్లుకు ఆమోదం

నిత్యావసర వస్తువుల సవరణ బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు 2020కి కేంద్రం ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ అధీర్ రంజన్ చౌదరి ఈ బిల్లును వ్యతిరేకించగా.. అది సహకార సమాఖ్య సూత్రాలకు వ్యతిరేకమని, ఇది కేవలం హోర్డింగ్‌ను పెంచుతుందని ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. రైతులు లాక్‌డౌన్‌ భారాన్ని మోస్తున్నందున ఆర్డినెన్స్ అవసరమని, ఆరుగురు ముఖ్యమంత్రులతో కూడిన హై పవర్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకువచ్చారని వినియోగదారుల వ్యవహారాల శాఖ రావు మంత్రి సాహెబ్‌ డాన్వే తెలిపారు. అనంతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు-2020ని ఉపసంహరించుకునే సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎన్‌కే ప్రేమచంద్రన్‌ వ్యతిరేకించారు. బిల్లు బడ్జెట్ సెషన్‌లో ఆమోదం పొందలేకపోయిందని, తర్వాత ఆర్డినెన్స్‌ తీసుకువచ్చారన్నారు. అధికార దుర్వినియోగంపై స్పష్టమైన కేసు ఉందన్నారు. తీవ్ర ఒత్తిడికి గురైన సహకార బ్యాంకులను కాపాడేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. తాజాగా బిల్లు తీసుకువస్తో౦దని, ఇది ఉపసంహరించబడుతున్న బిల్లులోని నిబంధనలను కలిగి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం వాయిస్ ఓటింగ్ ద్వారా బిల్లును ఉపసంహరించుకున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.