శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 17:14:56

సీఎంతో పాటే మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు..

సీఎంతో పాటే మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు..

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీ పీఠంపై జెండా ఎగురవేసింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 స్థానాలు గెలుచుకున్న ఆప్‌.. తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. కాగా, ఇవాళ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్‌ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం, మాజీ ఉపముఖ్యమంత్రి మానిష్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటే కేబినెట్‌ మంత్రులంతా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ఫిబ్రవరి 16, ఆదివారం ఉదయం 10 గంటలకు కేజ్రీ.. రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ ప్రజల సాక్షిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు.


logo