సోమవారం 18 జనవరి 2021
National - Jan 08, 2021 , 15:07:06

కేంద్రం, రైతు నేత‌ల మ‌ధ్య 8వ విడుత చ‌ర్చ‌లు ప్రారంభం

కేంద్రం, రైతు నేత‌ల మ‌ధ్య 8వ విడుత చ‌ర్చ‌లు ప్రారంభం

న్యూఢిల్లీ: వివాదాస్ప‌ద వ్యవ‌సాయ చ‌ట్టాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం, రైతు సంఘాల నేత‌ల మ‌ధ్య 8వ విడుత చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ మేర‌కు ఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వ‌న్‌లో కేంద్ర‌మంత్రులు న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌, పీయూష్ గోయల్.. ప‌లువురు రైతు నాయ‌కులు స‌మావేశ‌మ‌య్యారు. కాగా, రైతు నేత‌లు, కేంద్ర సర్కారు మ‌ధ్య ఇప్ప‌టికే 7 విడుత‌లు చ‌ర్చలు జ‌రిగాయి. ఈ ఏడు విడుత‌ల్లోనూ చిన్న‌చిన్న డిమాండ్ల‌ ప‌రిష్కారం త‌ప్ప ఎలాంటి పురుగ‌తి లేదు. రైతుల ప్ర‌ధాన డిమాండ్లు అయిన‌ పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌, మూడు వివాదాస్ప‌ద చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణపై ఏ మాత్రం ముంద‌డుగు ప‌డ‌టంలేదు. ఈ 8వ విడుత చ‌ర్చ‌లతోనైనా ఫ‌లితం ఉంటుందా..? లేదంటే మ‌ళ్లీ ఎప్పటి ప‌రిస్థితి పున‌రావృత‌మ‌వుతుందా..? అనేది వేచిచూడాలి.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.