గురువారం 26 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 20:32:37

దశాబ్దాలుగా నిమజ్జనం చేయని అమ్మవారి విగ్రహం..ఎక్కడుందంటే?

దశాబ్దాలుగా నిమజ్జనం చేయని అమ్మవారి విగ్రహం..ఎక్కడుందంటే?

వారణాసి: నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలను విజయ దశమి సందర్భంగా నిమజ్జనం చేస్తుంటారు. కొన్నిచోట్ల ట్రాఫిక్‌ పరిస్థితిని దృష్టిలోపెట్టుకొని కొద్దిగా ఆలస్యంగా నిమజ్జనం చేస్తుంటారు. కానీ, దశాబ్దాలుగా నిమజ్జనం చేయకుండా అలాగే ఉంచిన అమ్మవారి మట్టివిగ్రహం కూడా ఉందట. 

ఈ విగ్రహం వారణాసిలో ఉంది. దీనిని  నవరాత్రి ఆరో రోజు షష్టిన  బంగాలి తోలా ప్రాంతంలోని దుర్గా బాడిలో ఒక బెంగాలీ కుటుంబం స్థాపించింది. నిమజ్జనం కోసం ఈ విగ్రహాన్ని లేపాలని చూస్తే ఒక ఇంచుకూడా కదలలేదని ఓ స్థానికుడు తెలిపాడు. మట్టితో చేసిన విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందట. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ఈ విగ్రహానికి పేయింట్‌వేసి, కొత్తబట్టలు వేస్తారట. తమ పూర్వీకులకు అమ్మవారు కలలో వచ్చి ఇక్కడనుంచి కదలబోనని చెప్పినట్లు విగ్రహాన్ని స్థాపించిన బెంగాలీ కుటుంబానికి చెందిన ఐదో తరం సభ్యుడు హేమంత్ తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.