శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 23:20:23

రేప్ ఫ్రీ కంట్రీగా మారుస్తామని ప్రతిజ్ఞ చేపట్టిన "డీఎన్‌ఏ ఫైట్స్‌ రేప్‌" సంస్థ

రేప్ ఫ్రీ కంట్రీగా మారుస్తామని ప్రతిజ్ఞ చేపట్టిన

ఢిల్లీ:లాక్‌డౌన్‌ తరువాత దేశంలో నేరాలు పెరుగుతున్న వేళ, లైంగిక వేధింపులు , అత్యాచారాలు వంటివి మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి అతి పెద్ద ఆందోళనలుగా కొనసాగుతున్నాయి. మొట్టమొదటిసారిగా, దేశ వ్యాప్తంగా సుప్రసిద్ధ గొంతుకలన్నీ కూడా అత్యాచార సంఘటనల నేర పరిశోధనలో డీఎన్‌ఏ ను సాక్ష్యం గా వినియోగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ క్రిమినల్‌ జస్టిస్‌ డే ను జూలై 17న జరుపుకుంటున్న సందర్భంగా" డీఎన్‌ఏ ఫైట్స్‌ రేప్‌" ఇప్పుడు భారతదేశాన్ని అత్యాచార రహితంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేపట్టింది .

ఆ దిశగా ఈ సంవత్సరమంతా కృషి చేస్తామని  ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రముఖ యాంకర్ నటి గీతికా గంజుధార్‌ తన సందేశాన్ని పంచుకున్నారు ‘‘ 2024 సంవత్సరం నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను తీర్చిదిద్దాలనే ప్రధానమంత్రి లక్ష్యానికి అభినందనలు. దానితో పాటుగా, భారతదేశంలో మహిళల భద్రతా కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది . మనం తప్పనిసరిగా 2030 సంవత్సరం నాటికి  అత్యాచార రహిత సమాజాన్ని నిర్మించాలని" ఆమె పేర్కొన్నారు. "అత్యంత నిర్ణయాత్మక సాక్ష్యంగా అత్యాచార నిందితుని డీఎన్‌ఏ నిలుస్తుంది. అయితే డీఎన్‌ఏ ఫోరెన్సిక్స్‌ పట్ల అవగాహన భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నది.  దీని సేకరణ అతి పెద్ద సమస్యగా మారింది.

భారతదేశంలో అత్యాచార బాధితురాలైన మహిళ దానిని అవమానంగా భావించడంతో పాటు, తమ తప్పును తామే సరిదిద్దుకోవాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను కోరుతుండటమూ కనిపిస్తుంది. ఆమె స్నానం చేయడంతో పాటుగా ఆమె వస్త్రాలను సైతం శుభ్రపరచడం లేదా కాల్చివేయడం జరుగుతుంది. ఈ కారణంతో అత్యంత కీలకమైన డీఎన్‌ఏ సాక్ష్యం కేసు నివేదించే నాటికే ఉపయోగపడకుండాపోతుంది. ‘ కడుగవద్దు, శుభ్రపరచవద్దు, సాక్ష్యంను భద్రపరచండి ’అనే సందేశాన్ని డీఎన్‌ఏ ఫైట్స్‌ రేప్‌  పునరుద్ఘాటిస్తుంది. న్యాయం పొందేందుకు, మనకు డీఎన్‌ఏ కావాలి ... దానికోసం మనం అత్యాచార సంఘటన , అత్యాచార పరిశోధన సమయంలో శరీరంపై లభించే సాక్ష్యాన్ని భద్రపరచాలని"  సీనియర్‌ న్యాయవాది డాక్టర్‌ పింకీ ఆనంద్ తెలిపారు.


తాజావార్తలు


logo