మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 19:04:41

కరోనా నుంచి కోలుకొంటున్న దేశ రాజధాని?

కరోనా నుంచి కోలుకొంటున్న దేశ రాజధాని?

న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల కింద కరోనా కేసుల నమోదు చూస్తే సెప్టెంబర్‌వరకు అక్కడ అందరికీ కరోనా వచ్చేలా ఉందని వైద్యాధికారులు భయాందోళకు గురయ్యారు. రోజుకు సుమారుగా 4నుంచి 5వేల పైనే కేసులు నమోదు కాగా వందల మంది వైరస్‌బారిన పడి ప్రాణాలొదిలేవారు. జూన్ ‌మొదటి వారంలో రోజూ సుమారు 4వేల కేసులు నమోదయ్యేవి. జూన్ ‌చివరి వారంలో ఆ సంఖ్య 2500కు చేరింది. జూలై మొదటి వారంలో 1500 కేసులు నమోదు అవుతుండగా జూలై చివరి వారానికి కేసులు వెయ్యికి మించడం లేదు. గత రెండు రోజుల నుంచి 800, 900 కేసులు నమోదవుతుండడంతో రాజధానిలో కరోనా వైరస్ ‌క్షీణిస్తోందని వైద్యులు వాపోతున్నారు. ఈ విషయమై సీఎం అరవింద్‌ కేజ్రివాల్ ‌ఇటీవల మాట్లాడుతూ ఢిల్లీలో సానుకూల పరిస్థితులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా తాజాగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 805 కరోనా కేసులు నమోదయ్యాయి. 937 మంది కోలుకొని దవాఖాన నుంచి ఇవాళ డిశ్చార్జి కాగా 17 మంది మరణించినట్లు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 1,38,482కు చేరింది. ఇందులో 1,24,254 మందికి వ్యాధి నయమై డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 4021 మంది మృత్యువాత పడినట్లు అధికారులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo