ఆదివారం 06 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 08:48:34

బీహార్‌లో దూసుకుపోతున్న మ‌హాఘ‌ట‌బంధ‌న్‌

బీహార్‌లో దూసుకుపోతున్న మ‌హాఘ‌ట‌బంధ‌న్‌

పాట్నా : బీహార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. ఆ రాష్ర్ట ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మ‌హాఘ‌ట‌బంధ‌న్ దూసుకుపోతోంది. ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ ఆశ‌లు ఫ‌లించేలా ఫ‌లితాలు వ‌చ్చే ఛాన్స్ ఉంది. ప్ర‌స్తుతానికి మ‌హాఘ‌ట‌బంధ‌న్ 70కి పైగా స్థానాల్లో ముందంజ‌లో ఉంది. ఎన్డీయే కూట‌మి 50 స్థానాల్లో లీడ్‌లో ఉండ‌గా, ఎల్జేపీ 2, ఇత‌రులు నాలుగు స్థానాల్లో ముందంజ‌లో ఉన్నారు. 

2015 ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి అధికారాన్ని చేజిక్కించుకున్న విష‌యం తెలిసిందే. నాటి ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మికి 125 స్థానాలు, మ‌హాఘ‌ట‌బంధ‌న్ 110, ఎల్జేపీ 2, ఇత‌రులు 6 స్థానాల్లో గెలుపొందారు.