బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 02:43:09

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి!

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి!

  • కరోనా మహమ్మారి ఊహకందని విధంగా వ్యాప్తి చెందుతున్నది. దీనిపై అంచనాలు తలకిందులవుతున్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు..

ఇంట్లో ఉంటే సేఫ్‌

ఇంట్లో ఉంటే సురక్షితమని ఇప్పటివరకు భావించారు.

ఇంట్లో ఉన్నా రిస్కే

ఇంట్లో ఉన్నా రిస్కే అని తాజా అధ్యయనం వెల్లడిస్తున్నది. బయటి వ్యక్తుల కంటే కుటుంబ సభ్యుల ద్వారానే వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువని దక్షిణకొరియాకు చెందిన సాంక్రమిక వ్యాధి నిపుణుల అధ్యయనంలో తేలింది. 

గాలి ద్వారా సోకదు

 దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారానే వైరస్‌ సోకుతుందని, గాలి ద్వారా వైరస్‌ సంక్రమించే అవకాశం లేదని        డబ్ల్యూహెచ్‌వో మొదటి నుంచీ చెబుతూ వచ్చింది.

గాలి ద్వారానూ వ్యాప్తి

గాలి ద్వారానూ వైరస్‌ సంక్రమించే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు గుర్తించారు. డబ్ల్యూహెచ్‌వో సైతం ఈ విషయాన్ని అంగీకరించింది. 

వస్త్రం కంటే మాస్క్‌ మంచిది 

దుస్తులతో మూతి, ముక్కు కప్పుకోవడం, సాధారణ మాస్క్‌లను వాడడం కంటేఎన్‌-95 మాస్క్‌లు వైరస్‌ను బాగా అడ్డు కుంటాయని తొలుత భావించారు.

కాటన్‌ మాస్క్‌లే మేలు

కవాటాలు ఉన్న ఎన్‌-95 మాస్క్‌లు వైరస్‌ను అడ్డుకోలేవని, కాటన్‌ వస్త్రంతో తయారైన సాధారణ మాస్క్‌లు వాడడమే ఉత్తమమని కేంద్రం తాజాగా వెల్లడించింది. 

శ్వాసకోశ వ్యవస్థపైనే దాడి

కరోనా వైరస్‌ కేవలం శ్వాసకోశ వ్యవస్థ మాత్రమే దాడి చేస్తున్నదని ఇప్పటివరకు భావించారు. 

అన్ని భాగాలపైనా ప్రభావం

అయితే, శరీరంలోని అన్ని అవయవాలపైనా ఇది ప్రభావం చూపిస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు..ఇలా అన్ని అవయవాలపైనా ఇది దాడిచేస్తున్నట్లు తేలింది.

ఉష్ణోగ్రతలని  పరిశీలించాలి

 కరోనా రోగులను గుర్తించడంలో శరీర ఉష్ణోగ్రతను పరిశీలించడం తప్పనిసరి ప్రక్రియగా ఉన్నది. 

మంచి కంటే చెడే ఎక్కువ

ఉష్ణోగ్రత పరిశీలన వల్ల మంచి కంటే చెడే ఎక్కువని తాజాగా పరిశోధకులు చెబుతున్నారు. రద్దీ ప్రదేశాల నుంచి రోగులను దూరంగా ఉంచడంలో ఈ పద్ధతి నమ్మదగినది కాదని పేర్కొంటున్నారు.


logo