బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 21:09:56

ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీ-1 వివరాలు

ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీ-1 వివరాలు

ఢిల్లీ : కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ఆర్థిక ప్యాకేజీ వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు. ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆర్థికమంత్రి రానున్న రోజుల్లో దశలవారీగా వివరించనున్నారు. ఈ క్రమంలో భాగంగా బుధవారం ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీ-1 వివరాలను ప్రకటించారు. తొలి ప్యాకేజీ ద్వారా సుమారు రూ. 6 లక్షల కోట్ల మేర ప్రయోజనాలను వివిధ రంగాలకు ప్రకటించారు. ఈ ప్యాకేజీ రెగ్యూలేటరీ సంస్కరణలు, సులభ ఉచిత రుణాలు, భారీ లిక్విడిటీ ఇంజక్షన్‌, పన్ను ఉపశమనాలు, ఎస్‌ఎంఎస్‌ఈల పునరుజ్జీవనానికి మార్గం సుగుమం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్యాకేజీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

 1. ఎంఎస్‌ఎంఈల కోసం రూ. 3 లక్షల కోట్ల సులభ రుణాలు

2. ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈల తక్షణం ఆదుకునేందుకు రూ. 20 వేల కోట్లు

3. ఎంఎస్‌ఎంఈల కోసం రూ. 50 వేల కోట్లతో ఈక్విటీ ఫండ్‌

4. మరిన్ని ప్రయోజనాలు కల్పించే నిమిత్తం ఎంఎస్‌ఎంఈల అర్హతల్లో సడలింపులు

5. రూ. 200 కోట్ల వరకు కాంట్రాక్టులకు గ్లోబల్‌ టెండర్లు అవసరం లేదు

6. ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎంఈలకు మరో మూడు నెలల పాటు రూ.2,500 కోట్లు ప్రభుత్వమే పీఎఫ్‌ చెల్లిస్తుంది

7. మూడు నెలల పాటు బిజినెస్‌, కార్మికులకు ఈపీఎఫ్‌ సహకారం నిమిత్తం రూ.6,750 కోట్లు తగ్గింపు

8. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు, హెచ్‌లలో రూ. 30 వేల కోట్ల లిక్విడిటీ

9. పాక్షిక క్రెడిట్‌ గ్యారెంటీ స్కీమ్‌ 2.0 కింద ఎన్‌బీఎఫ్‌సీకి రూ. 45 వేల కోట్లు

10. విద్యుత్‌ పంపిణీ సంస్థల కోసం రూ. 90 వేల కోట్ల లిక్విడిటీ

11. కేంద్ర సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలలు పొడిగింపు, పాక్షిక బ్యాంకు గ్యారంటీ

12. రెరా కింద పూర్తి చేయాల్సిన రియాల్టీ ప్రాజెక్టుల సమయం 6 నెలలు పొడిగింపు

13. టీడీఎస్‌, టీసీఎస్‌ రేటు తగ్గింపు వల్ల రూ.50 వేల కోట్ల లిక్విడిటీ

14. ఇన్‌కంటాక్స్‌ చెల్లింపు గడువును 30 నవంబర్‌, 2020 వరకు పొడిగింపు

15. వివాద్‌ సే విశ్వాస్‌ డెడ్‌లైన్‌ గడువు 31 డిసెంబర్‌,2020 వరకు పొడిగింపు.  


logo