శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 17:21:16

కేంద్ర ప్రభుత్వం పేదలకు పూర్తి విరుద్దంగా నడుస్తోంది: ప్రియాంక

కేంద్ర ప్రభుత్వం పేదలకు పూర్తి విరుద్దంగా నడుస్తోంది: ప్రియాంక

ఉత్తరప్రదేశ్‌: నరేంద్ర మోది నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా నడుచుకుంటోందని కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఇవాళ ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోది, హోం మంత్రి అమిత్‌షా వారు ఏం చేస్తే అది దేశంలో అమలు కావాలని ఆరాటపడుతున్నారనీ.. తాము చెప్పిందే శాసనమన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో ఆధిక్యం ఉన్నదనీ వాళ్లు చేసే ప్రతి పని సరైనది అనుకొని, ప్రజలపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక విమర్శించారు. మీకు మద్దతుగా మేమున్నామని ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎలాంటి న్యాయబద్దం కాని సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌(సీఏఏ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ)కి కాంగ్రెస్‌ పూర్తి వ్యతిరేకమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన పోరాడడానికి కాంగ్రెస్‌ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ప్రజలకు భరోసానిచ్చారు.


logo